66వ జాతీయ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో అట్టహాసంగా జరిగింది. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వివిధ కేటగిరీలలో ఎంపికైన వారికి అవార్డులను ప్రదానం చేశారు. మహానటి చిత్రానికిగాను ఉత్తమ నటిగా కీర్తిసురేశ్ అవార్డు అందుకోగా..చి.ల.సౌ చిత్రానికి ఒరిజినల్ స్క్రీన్‌ప్లే అవార్డును రాహుల్ రవీంద్రన్ అందుకున్నారు. ఉరి (హిందీ)చిత్రానికిగాను ఉత్తమ నటుడిగా విక్కీకౌశల్, ఉత్తమ డైరెక్టర్‌గా ఆదిత్యాధర్ అందుకున్నారు. అందాదున్ చిత్రానికి ఆయుష్మాన్ ఖురానా బెస్ట్ యాక్టర్ అవార్డును అందుకున్నాడు.
ఉత్తమ నటి అవార్డును అందుకున్న కీర్తిసురేశ్