లోకాయుక్తగా జస్టిస్‌ సివి రాములు ప్రమాణం

తెలంగాణ లోకాయుక్తగా జస్టిస్‌ సివి రాములు, ఉపలోకాయుక్తగా వి.నిరంజన్‌ రావు ప్రమాణస్వీకారం చేశారు. సోమవారం సాయంత్రం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ వీరిచే ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌ రావు, మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


 


అనుభవశాలి జస్టిస్ సీవీ రాములు

జస్టిస్ సీవీ రాములు నిజామాబాద్ జిల్లా బోధన్ సమీపంలోని అచ్చనపల్లిలో 1949 లో జన్మించారు. హైస్కూల్ విద్యను బోధన్‌లో, డిగ్రీ నిజామాబాద్ గిరిరాజ్ ప్రభుత్వ కళాశాలలో పూర్తిచేశారు. ఔరంగాబాద్‌లోని మరాఠ్వాడా వర్సిటీలో ఎల్‌ఎల్‌బీ పూర్తిచేసిన ఆయన.. 1978లో న్యాయవాదిగా నమోదు చేసుకున్నారు. ఉమ్మడి ఏపీ హైకోర్టులో 24 ఏండ్లపాటు ప్రాక్టీస్‌చేశారు. 2002లో ఏపీ అదనపు న్యాయమూర్తిగా ఎలివేట్ అయ్యా రు. 2004లో శాశ్వత న్యాయమూర్తిగా నియమితులై 2011లో రిటైర్ అయ్యారు.